అమెజాన్ 'ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్' పేరుతో భారీ రాయితీలు

 


స్మార్ట్‌ఫోన్ కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ 'ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్' పేరుతో భారీ రాయితీలు, ఈఎంఐ ప్లాన్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో సేల్ ప్రారంభించింది. నేడు ప్రారంభమైన ఈ సేల్ ఈ నెల 25 వరకు కొనసాగుతుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు రాయితీ లభిస్తుంది. శాంసంగ్, షియోమీ, వన్‌ప్లస్, రియల్‌మి తదితర మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభించనుంది. వీటితోపాటు రీఫర్‌బిష్డ్ మోడళ్లపై 65 శాతం వరకు అమెజాన్ రాయితీ ప్రకటించింది.

అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్ మోడళ్లు, యాక్సెసరీలపై 40 శాతం వరకు రాయితీ లభిస్తుంది. అలాగే, ఈఎంఐ ప్లాన్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఐ, అంబ్రేన్ పవర్ బ్యాంకులు, వన్‌ప్లస్, శాంసంగ్ ఇతర కంపెనీల హెడ్‌సెట్లపై 60 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తుండగా, మొబైల్ కేస్‌లపై 80 శాతం వరకు ఆఫర్ ప్రకటించింది.