అరుణాచల్‌ప్రదేశ్‌లో మంగళవారం భూకంపం

 


అరుణాచల్‌ప్రదేశ్‌లో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 2.3 తీవ్రతతో వెస్ట్‌ కామెంగ్‌లో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది. తెల్లవారు జామున 4.09 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు వచ్చాయని పేర్కొంది. సోమవారం అసోం రాష్ట్రంలోని నాగాన్‌ ప్రాంతంలో రిక్టర్‌ స్కేల్‌పై 3.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అలాగే పంజాబ్‌లోని బతిండాలోనూ ప్రకంపనలు వచ్చాయి.