నేటి నుంచి సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌

 


గ్రేటర్‌లో హెల్త్‌కేర్‌ వర్కర్లకు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు కరోనా ఫస్ట్‌డోస్‌ వ్యాక్సినేషన్‌ ముగియడంతో నేటి నుంచి సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ కొనసాగనుంది. మొదటి డోస్‌ తీసుకున్న 28రోజుల తరువాత రెండో డోస్‌ తీసుకోవాల్సి ఉండడంతో మొదటి డోస్‌ తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలందిరికీ నిర్ణీత షెడ్యూలు ప్రకారం రెండో డోస్‌ టీకా ఇస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌ వ్యాప్తంగా మొత్తం 1,08,925మంది హెల్త్‌కేర్‌ వర్కర్లు టీకా కోసం తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోగా వారిలో 69,546మంది ఆరోగ్య కార్యకర్తలు ఫస్ట్‌డోస్‌ కరోనా టీకా తీసుకున్నారు. హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 43,123మందికి, రంగారెడ్డి జిల్లా పరిధిలో 16,423మందికి, మేడ్చల్‌-మల్కాజిగిరి పరిధిలో 10వేల మందికి టీకా వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 13న 775మంది ఆరోగ్య కార్యకర్తలకు రెండో డోస్‌ టీకా వేయగా నేటి నుంచి మిగిలిన వారికి సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ ఇవ్వనున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.