నగరంలో సినీఫక్కీలో జరిగిన కిడ్నాప్‌

 


నగరంలో సినీఫక్కీలో జరిగిన కిడ్నాప్‌ కేసును బంజారాహిల్స్‌ పోలీసులు నాలుగు గంటల్లోనే ఛేదించారు. ఆరుగురు ముఠా సభ్యుల్లోని నలుగురిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నగర పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌తో కలిసి సీపీ అంజనీకుమార్‌ వివరాల వెల్లడించారు. చెన్నైకి చెందిన వి.కుమార గురు, పలూరు లోకేష్‌కుమార్‌, ఎస్‌.జగదీష్‌, పీకే గణేష్‌ కుమార్‌లు చెన్నై సినీ ఇండిస్టీలో పనిచేస్తున్నారు. చెన్నైకి చెందిన (పరారీలో ఉన్నారు) సినీ ప్రొడెక్షన్‌ మ్యానేజర్‌ ప్రదీప్‌ నటరాజన్‌తో కలిసి పనిచేస్తున్నారు. నగరంలో మేకప్‌ ఆర్టీస్ట్‌, ప్రొడ్యూసర్‌ మేనేజర్‌గా వ్యాపారం నిర్వహిస్తున్న కె.అమర్‌నాథ్‌రెడ్డితో వారికి పరిచయం ఏర్పడింది. ఇదిలావుండగా చెన్నైకి చెందిన ప్రదీప్‌ నటరాజన్‌ ఓ సినిమా విషయంలో ఫిల్మి ఇండ్రస్టీకి చెందిన జునైధ్‌, అన్ను అనే ఇద్దరు మేనేజర్లు కలిశాడు. సినిమాలో నటించేందుకు ఓ ప్రముఖ హిరోహీన్‌ను కలిపిస్తామని నమ్మించిన జునైద్‌, అన్నులు నటరాజన్‌ నుంచి రూ.13.5లక్షలను దండుకున్నారు. అయితే హీరోహిన్‌ను కలిపించలేదు. దాంతో తిరిగి డబ్బులు ఇవ్వాలని నటరాజన్‌ ఒత్తిడిచేయడంతో వారు స్పందించ లేదు. దాంతో నటరాజన్‌ విషయాన్ని అమర్‌నాథ్‌ రెడ్డికి చెప్పారు. మ్యాటర్‌ సెటిల్‌ చేసి డబ్బులు ఇప్పించాలని అందుకు కొత్త డబ్బులు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఇదిలాఉండగా జునైద్‌, అన్నుల నుంచి రూ.10లక్షలు వసూలు చేసిన అమర్‌నాథ్‌రెడ్డి మాత్రం నటరాజన్‌కు డబ్బులు ఇవ్వలేదు. నటరాజన్‌ రూ.4లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో వారిని నుంచి అమర్‌నాథ్‌రెడ్డి తప్పించుకుని తిరుగుతున్నాడు. డబ్బులు వసూలు చేసేందుకు హైదరాబద్‌కు వచ్చిన నటరాజన్‌ గ్యాంగ్‌ అమర్‌నాథ్‌ కోసం రెక్కీ నిర్వహించారు. మాదాపూర్‌లో తన కార్యాలయంలో అమర్‌నాథ్‌ ఉన్నట్టు గుర్తించి కిడ్నాప్‌ చేశారు.ఆరుగురు కలిసి అమర్‌నాథ్‌ను కాడ్నాప్‌ చేసిన నిందితులు ఆయన భార్య కె.కల్పనారెడ్డితో మాట్లాడించారు. ఆందోళనకు గురైన బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'మధ్యాహ్నం 1:20 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి తన భర్త ఫోన్‌ నుంచి కాల్‌ చేసి తన భర్తతో మాట్లాడించాడని, ఇంట్లో ఉన్న బంగారాన్ని తన తమ్ముడు శివకు ఇచ్చి కుదవ పెట్టి రూ. 4 లక్షలు సర్దుబాటు చేయమని చెప్పారన్నారు. కాసేపటి తర్వాత కిడ్నపర్‌ వేరే నెంబర్‌ నుంచి కాల్‌ చేసి రూ. 4 లక్షలు సిద్ధం చేసి అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేయమని ఒత్తిడి పెంచారన్నారు. ఆ కిడ్నాపర్స్‌ మళ్లీ మళ్లీ పోన్లు చేస్తూ అమర్నాథ్‌ రెడ్డి రూ. 4 లక్షలు ఇవ్వాలని, అవి సాయంత్రం 5 గంట్లలోపు ట్రాన్స్‌ఫర్‌ చేయకపోతే అమర్‌నాథ్‌ రెడ్డిని కారులో చెన్నైకు తీసుకువెళ్లి చంపేస్తామని బెదిరించారని' కల్పన రెడ్డి పోలీసులకు తెలిపారు. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు. డబ్బులు ఇస్తామని చెప్పడంతో వనస్థలి పురం వరకు వెళ్లిన వారిలో ఓ కిడ్నాపర్‌ శ్రీనగర్‌ కాలనీకి వచ్చాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు, కిడ్నాపర్లు చెన్నై పారిపోతున్నట్టు గుర్తించి నలొండ పోలీసులను అప్రమత్తం చేశారు. వరి సహాయంతో మాడుగుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిల్లో కాడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి అమర్‌నాథ్‌ రెడ్డిని సురక్షితంగా కాపాడారు. నలుగురు చెన్నై కిడ్నాపర్లను అరెస్ట్‌ చేశారు. నాలుగు గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను అరెస్టు చేయడంతో సీపీ బంజారాహిల్స్‌ పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు. పరారీలో ఉన్న నటరాజన్‌, కీర్తన కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్‌ ఏసీపీ ఎం.సుదర్శన్‌, ఇన్‌స్పెక్టర్‌ కలింగరావు, డీఐ మహ్మద్‌ హఫీసొద్దీన్‌, ఎస్‌ఐలు కె.రామిరెడ్డి, బి.శ్రీనివాస్‌, డి.అజేరుకుమార్‌, కానిస్టేబుళ్లు వినోద్‌, రితీష్‌, సంతోష్‌తోపాటు పాల్గొన్నారు.