గత నెలలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ డే పరేడ్లో చెలరేగిన హింసాకాండపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు నేడు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామ సుబ్రహ్మణ్యన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపనుంది. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న నిర్వహించిన ర్యాలీలో విధ్వంసం చోటు చేసుకుంది. వేలాది మంది ఆందోళనకారులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి, పోలీసులపై సైతం దాడికి దిగారు. ఎర్రకోటలో మతానికి సంబంధించిన జెండాలను ఎగుర వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.