నేడే బల్దియాలో కొత్త పాలక వర్గం కొలువు

 


నేడే బల్దియాలో కొత్త పాలక వర్గం కొలువు తీరనుంది. ఉదయం 11.30 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా ఎన్నికైన 149 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీకి చెందిన ఒక కార్పొరేటర్ చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. మొత్తం మీద 44 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. మొత్తం 44 మంది ఎక్స్ అఫిషియో సభ్యుల్లో ఎమ్మెల్యేలు 21 మంది , ఎంపీలు 8 మంది, ఎమ్మెల్సీలు 15 మంది ఉన్నారు.


కార్పోరేటర్ల విషయానికి వస్తే 56 మంది టిఆర్ఎస్ కార్పోరేటర్లు ఉండగా, 44 మంది ఎంఐఎం కార్పోరేటర్లు ఉన్నారు. 48 మంది బీజేపీ కార్పోరేటర్లు ఉన్నారు. ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు. టిఆర్ఎస్ ఎక్స్ అఫిషియో సభ్యులు 32 మంది ఉండగా MIM ఎక్స్ అఫిషియో సభ్యులు 10 మంది ఉన్నారు. BJP ఎక్స్ అఫిషియో సభ్యులు ఇద్దరు ఉన్నారు. కాంగ్రెస్ ఎక్స్ అఫిషియో సభ్యులు ఎవరూ లేరు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకునేందుకు టిఆర్ఎస్ సిద్ధమవుతోంది. అయితే ఎవరి పేరు సీల్డ్ కవర్ లో ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.