పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. చమురు కంపెనీలు వరుసగా తొమ్మిదో రోజు బుధవారం కూడా పెంచాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. తాజాగా ఢిల్లీలో పెట్రోల్‌పై 30పైసలు, డీజిల్‌పై 25 పైసల వరకు పెంచాయి. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీటర్‌కు రూ.89.29, డీజిల్ రూ.79.95కు చేరింది. జైపూర్‌లో పెట్రోల్ లీటర్‌కు రూ.100కు చేరువలో ఉండగా.. డీజిల్ రూ.90కి దగ్గరలో ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్‌కు రూ.92.84, డీజిల్ రూ.87.20, ముంబైలో పెట్రోల్ రూ.95.75, డీజిల్ రూ.86.98, చెన్నై రూ.91.52, డీజిల్ 85.01, బెంగళూర్ రూ.92.54, డీజిల్ రూ.84.75, జైపూర్ రూ.96.01, డీజిల్ రూ.88.34కు పెరిగింది. వరుసగా పెరుగుతున్న ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఈ ఏడాదిలో పెట్రోల్, డీజిల్‌పై రూ.6 వరకు పెరిగింది. ఈ నెల 11 సార్లు ధరలు పెరిగాయి. ఇప్పటికే కరోనా మహమ్మారితో సరైన పనులు, ఉపాధి లేక ఇబ్బందులెదురవుతున్నాయని.. చమురు కంపెనీలు నష్టాల పేరిట ధరలు పెంచుతున్నాయని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.