భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

 


స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఈ రోజు ఏకంగా 1,939 పాయింట్లు నష్టపోగా, నిఫ్ట్ 14,430 పాయింట్ల దిగువన ముగిసింది. కిందటి సెషన్లో 51 వేలకు పైగా ఉన్న సెన్సెక్స్ ఏకంగా 49 వేల పాయింట్లకు పడిపోయింది. అన్ని రంగాలు కూడా భారీగా పతనమయ్యాయి. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు మరో 'బ్లాక్ ఫ్రైడే'ను చూశాయి. సూచీలు ఒకే రోజు మూడు శాతానికి పైగా నష్టపోవడం గమనార్హం. ఇంట్రాడేలో ఏ దశలోనూ సూచీలకు మద్దతు లభించలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1510 పాయింట్లు, నిఫ్టీ 387 పాయింట్ల తేడాను నమోదు చేశాయి.


రెండు పాయింట్లు పతనం... సెన్సెక్స్ ఉదయం 50,256 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 50,400 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,890 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నేడు 1,939 పాయింట్లు లేదా 3.80 శాతం నష్టపోయి 49,099.99 వద్ద ముగిసింది. సూచీ నేడు ఓ సమయంలో 2150 పాయింట్ల మేర పడిపోయింది. నిఫ్టీ 568 పాయింట్లు లేదా 3.76 శాతం నష్టపోయి 14,529.15 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,888.60 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,919.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,467.75 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.