రాష్ర్టంలో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు

 


రాష్ర్టంలో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో చలితీవ్రత తగ్గింది. తెల్లవారుజామున మాత్రమే కాస్త చలిగా అనిపిస్తున్నది. సోమవారం అతి తక్కువగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా భాగ్యనగర్‌ నందనవనంలో 12.7 డిగ్రీలు, అత్యధికంగా భద్రాది కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో 37.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ర్టంలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18.4 డిగ్రీలుగా రికార్డయినట్టు తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (టీఎస్‌డీపీఎస్‌) తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్‌లో అతి తక్కువగా 15.4 డిగ్రీలు, అత్యధికంగా అమీర్‌పేటలో 34 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ర్టంలో పొడి వాతావరణం నెలకొన్నది.