మెక్సికో దేశంలో జరిగిన ఎయిర్‌ఫోర్స్ విమాన ప్రమాదంలో ఆరుగురు సైనికులు దుర్మరణం

 


మెక్సికో దేశంలో జరిగిన ఎయిర్‌ఫోర్స్ విమాన ప్రమాదంలో ఆరుగురు సైనికులు దుర్మరణం చెందారు. వీరక్రూజ్ రాష్ట్రంలోని ఎమిలియానో జాపటా పట్టణంలో ఎయిర్‌ఫోర్స్ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు సైనికులు మరణించారని మెక్సికో దేశ జాతీయ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈఐ లెన్సిరో విమానాశ్రయం నుంచి బయలు దేరిన 3912 లియర్ జెట్ విమానం కొద్దిసేపటికే కూలిపోయింది. విమాన ప్రమాద స్థలాన్ని జుడీషియల్ కమిషనర్, ఎయిర్ ఫోర్సు కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ ఆర్మీ జనరల్ లు సందర్శించారు. ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. ఎయిర్ ఫోర్సు విమాన ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.