అమూల్య హోమ్స్‌పై చర్యలు

 


వాసవి శివనగర్‌ నుంచి జమ్మిగడ్డ వైపుగా వెళ్లే అప్రోచ్‌ రోడ్డును గేటెడ్‌ కమ్యూనిటీ పేరుతో రోడ్డును దర్జాగా ఆక్రమించి గేట్లు మూసివేసిన అమూల్య హోమ్స్‌పై చర్యలు తీసుకొని, అప్రోచ్‌ రోడ్డుకు విముక్తి కల్పించి ఆయా కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను వెంటనే పరిష్కరించాలని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని, చర్లపల్లి డివిజన్‌ కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవిని, ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్రెడ్డిని, కాప్రా సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ శంకర్‌ని చర్లపల్లి కాలనీల సంక్షేమ సంఘాల సమాఖ్య సీసీఎస్‌ కోరుతోంది.