తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

 


ఈశాన్య బీహార్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ, ఉత్తర కేరళ మీదుగా అరేబియా సముద్రం వరకు వీస్తున్న పశ్చిమగాలులతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోని ఒకటి రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనావేసింది. శనివారం అత్యల్పంగా ఆదిలాబాద్‌ జిల్లా అర్లి (టీ)లో 11.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆది, సోమవారాల్లో పొడివాతావరణం నెలకొనే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు, హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో అకాల వర్షాలకు అల్పపీడన ద్రోణి కారణమని చెప్పారు. నేడు అల్పపీడన ద్రోణి ప్రభావం బలహీనపడుతుందని పేర్కొన్నారు.