తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జన్మదిన శుభాకాంక్షలు

 


తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. సీఎం కేసీఆర్‌కు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ సహా పలువురు మంత్రులు శుభాకాంక్షలు చెప్పారు. కేసీఆర్‌ సారథ్యంలో దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల నెరవేరిందని, భావితరాల బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.