జీవశాస్త్ర రంగంలో ఆసియా ఖండంలోనే అతి పెద్దదిగా పేరొందిన 'బయో ఏషియా' సదస్సుజీవశాస్త్ర రంగంలో ఆసియా ఖండంలోనే అతి పెద్దదిగా పేరొందిన 'బయో ఏషియా' సదస్సు ఈసారి కరోనా, ఆరోగ్యం ప్రధాన ఎజెండాలుగా సాగనున్నది. 18వ ఎడిషన్ బయో ఏషియా సదస్సు ఈ నెల 22, 23 తేదీల్లో హైదరాబాద్‌లో జరుగనున్నది. కరోనా నేపథ్యంలో తొలిసారిగా వర్చువల్‌గా సదస్సు జరుగుతుంది. ఇందులో ప్రధానంగా కొవిడ్‌-19, ప్రపంచవ్యాప్తంగా జీవశాస్త్ర రంగంలో అది తీసుకొచ్చిన మార్పులపై చర్చిస్తారు. ఈ సమావేశం ఫార్మా, బయోటెక్‌ కంపెనీలు సీఆర్వోలు, సీఎంవోలు, సీడీఎంవోలు, బయోటెక్‌ స్టార్టప్‌లు, అకడమిక్‌ ఇన్‌స్టిట్యూషన్లు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, రాజకీయ నేతలు, నిపుణులకు మంచి అవకాశం.