ఫుట్‌బాల్‌ కోచ్‌గా అజయ్‌ దేవగణ్

 


బాలీవుడ్‌ ప్రముఖ హీరో అజయ్‌ దేవగణ్ ఫుట్‌బాల్‌ కోచ్‌గా నటిస్తున్న చిత్రం 'మైదాన్‌'. ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ కోచ్, మేనేజర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వంలో ఈ సినిమాను బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయిక. లాక్‌డౌన్‌ తర్వాత ఈ సినిమా చిత్రీకరణను మళ్లీ ప్రారంభిస్తున్నారు. ఈరోజు నుంచి ఫుట్‌బాల్‌ కోచ్‌గా అజయ్‌ మైదానంలో అడుగుపెట్టనున్నారు.