బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు. సీఎం సభను అడ్డుకుంటామన్న ప్రకటనతో అర్ధరాత్రి ఆయనను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ నాయకులను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈరోజు జిల్లాలోని హాలియాలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎంలో కేసీఆర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నాగార్జునసాగర్‌ చేరుకోనున్న సీఎం మధ్యాహ్నం 1 గంటకు నెల్లికల్లు దగ్గర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటకు హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.