శేఖర్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసిన రాజశేఖర్

 



సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ గరుడ వేగ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టడంతో వరుస సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య కరోనా బారిన పడి, తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అందరి ప్రేమ, అభిమానులు, ప్రార్ధనలతో కోలుకున్న రాజశేఖర్.. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్పొరేషన్ సంస్థల నిర్మాణంలో శేఖర్ అనే సినిమా చేస్తున్నాడు. కొత్త దర్శకుడు లలిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందించనున్నారు.  తన బర్త్ డే సందర్భంగా శేఖర్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసిన రాజశేఖర్ ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు.ప్రియాతి ప్రియమైన.. నన్ను ప్రేమించే వాళ్ళందరకి, నేను ప్రేమించే నా అభిమానులకి .. అతి భయంకరమైన కోవిడ్ 19, నన్ను మరణపు సరిహద్దుల్లోకి తీసుకెళ్లినా, మీ ప్రేమ, అభిమానం, నిరంతర ప్రార్ధనలతో, నన్ను మళ్ళీ ఈ నా పుట్టిన రోజు నాడు కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించే స్థితికి తీసుకొచ్చాయి. కనిపించని ఆ దేవుడికి, కనిపించే దేవుళ్ళైన మీకు సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎల్లప్పుడు మీకు రుణపడి ఉంటాను అని రాజశేఖర్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.