అమెజాన్-ఫ్యూచర్ గ్రూప్ న్యాయ పోరాటం సుప్రీంకోర్టుకు చేరింది. ఫ్యూచర్ రిటైల్‌ను రిలయన్స్ రిటైల్‌కు అమ్మే ఒప్పందాన్ని అడ్డుకోవాలని అమెజాన్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఒప్పందంపై యథాతథస్థితిని ఢిల్లీ హైకోర్టు సోమవారం రద్దు చేయడంతో అమెజాన్ ఈ చర్య తీసుకుంది. అయితే రెండు కంపెనీలు దీనిపై అధికారికంగా నోరు విప్పడం లేదు. ఈ ఒప్పందానికి సీసీఐ, సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు ఇప్పటికే ఆమోదం తెలిపాయి. ఇంకా ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావలసి ఉంది. ఈ నేపథ్యంలో అమెజాన్ ఇండియా సుప్రీం కోర్టును ఆశ్రయించడం విశేషం.