ఏపీ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీ

 ఏపీ  రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెనుకబడిన తరగతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి.అనంత రామును నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే కె.ప్రవీణ్ కుమార్​ను సాధారణ పరిపాలన శాఖలోని సంస్కరణల విభాగానికి బదిలీ చేశారు. ఏపీ కేడర్‌కు వచ్చిన జి.జయలక్ష్మిని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిగా, అలాగే నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగాల అదనపు బాధ్యతలను కూడా అప్పగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.