రేషన్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్‌తో ప్రజలు కష్టాలు
 వికారాబాద్: జిల్లా కేంద్రంలో రేషన్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్‌తో ప్రజలు కష్టాలుపడుతున్నారు. గత మూడు రోజులుగా తిరుగుతున్న తమ వంతు రావడం లేదని లబ్ధిదారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ సెంటర్ వద్ద అర్ధరాత్రి తీవ్ర చలిలో మంటలు వేసుకుని మరి జనం పడిగాపులు కాస్తున్నారు. లింక్ లేకపోతే బియ్యం ఇవ్వరేమోననే భయం ప్రజల్లో నెలకొంది. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి రేషన్ సెంటర్లను పెంచాలని లబ్దిదారులు డిమాండ్ చేస్తున్నారు.