పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు

 


పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యుల జేబులను గుల్ల చేస్తున్నాయి. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 15 సార్లు ధరలు పెరగడం గమనార్హం. పెరుగుతున్న ఇంధన ధరలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పందించారు. పెట్రోల్, డీజిల్‌పై పరోక్ష పన్నులు తగ్గించాలని పిలుపు ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థపై వ్యయపరంగా ఒత్తిడిలు మరింత పెరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ఇప్పటికే నాలుగు రాష్ట్రాలు స్పందించాయి. స్వల్పంగా పన్నులను సడలించాయి.