పేపాల్ భారత్‌లో సేవలు బంద్ చేయనుంది. ఈ గ్లోబల్ డిజిటల్ పేమెంట్ యాప్ వచ్చే ఏప్రిల్ నెల ఒకటో తేదీ (1 ఏప్రిల్ 2021) నుండి భారత్‌లో డొమెస్టిక్ పేమెంట్ బిజినెస్‌ను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. మన దేశంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో పేపాల్ సంస్థకు యూనిట్లు ఉన్నాయి. అమెరికా వెలుపల అత్యధిక కేంద్రాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ బిజినెస్ డెవలప్మెంట్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. ప్రోడక్ట్ డెవలప్మెంట్లో పెట్టుబడులు కొనసాగిస్తామని తెలిపింది.
2020లో ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ డాలర్ల విక్రయాలు జరిపింది. మన దేశంలో 3,60,000 మర్చంట్లు ఉన్నారు. 2020 నాలుగో త్రైమాసికంలో 6.12 బిలియన్ డాలర్ల రెవెన్యూ వచ్చింది. 39 శాతం వృద్ధితో మొత్తం చెల్లింపుల విలువ 277 బిలియన్ డాలర్లుగా ఉంది. నాలుగో త్రైమాసికంలో కొత్తగా 1.6 కోట్ల ఖాతాదారులు పేపాల్‌కు జత కలిశారు.
ట్రావెల్ అండ్ టికెటింగ్ సేవల మేక్ మై ట్రిప్, ఆన్లైన్ ఫిలిం బుకింగ్ యాప్ బుక్ మై షో, ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వంటి పలు ఆన్లైన్ అనువర్తనాలలో పేపాల్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పేపాల్ యాప్‌కు 350 మిలియన్ల కస్టమర్లు ఉన్నారు.