బీహార్‌లో ఆరేళ్ల తరువాత సోమవారం రాత్రి భూ ప్రకంపనలు

 
బీహార్‌లో ఆరేళ్ల తరువాత సోమవారం రాత్రి భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూపంప తీవ్రత 3.5గా నమోదైంది. భూకంప కేంద్రం పట్నాలో ఉన్న కారణంగా ఆ ప్రాంతంలో దీని ప్రభావం కనిపించింది. బీహార్‌లోని పలు జిల్లాల్లో రాత్రి 9 గంటల 23 నిముషాలకు ఏడు సెకెన్ల పాటు భూమి కంపించింది. ఇళ్లలోని ఫ్యాన్లు ఊగడాన్ని గమినించిన వారంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.


కొన్ని సెకెన్ల పాటు భూ ప్రకంపనలను గమనించారు. వివిధ ప్రాంతాల్లో వాహనాల్లో వెళుతున్నవారు వారి వాహనాలను నిలిపివేశారు. పట్నా వాతావరణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నలందాకు 20 కిలోమీటర్ల దూరంలోని పట్నా జిల్లాలో భూకంప కేంద్రం ఉంది. కాగా దీనికిముందు నికోబార్ దీవుల్లో సోమవారం రాత్రి 7 గంటల 24 నిముషాలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.2గా నమోదైంది.