లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు కాజల్ అగర్వాల్

 


డిజిటల్ మీడియా రంగం రోజురోజుకు సరికొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో వెబ్ సిరీస్‌    లలో నటించేందుకు అందాల భామలు ఆసక్తి చూపుతున్నారు. అక్కినేని కోడలు సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌తో త్వరలో ప్రేక్షకులని పలకరించనుండగా, ఇందులో టెర్రరిస్ట్ పాత్రలో కనిపించి అలరించనుంది. ఇక కలువ కళ్ళ సుందరి కాజల్ అగర్వాల్ రీసెంట్‌గా లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు సారథ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ హారర్ జోనర్‌లో తెరకెక్కింది.  ఒక టీవీ క్రూ టీఆర్పీలు సాధించాలని రిస్కీ రియాల్టీ షో ప్లాన్ చేస్తుంది. అందులోకి నిజంగానే దెయ్యాలు, ఆత్మలు ఎంట్రీ ఇవ్వటంతో అందరు టెన్షన్‌కు గురవుతారు. చాలా థ్రిల్లర్‌గా వెబ్ సిరీస్ ఉండగా,కాజల్ పాత్ర ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు మరో వెబ్ సిరీస్‌కు సైన్ చేసినట్టు తెలుస్తుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'త్రీ రోజెస్‌' అనే వెబ్ సిరీస్‌లో కాజల్ లీడ్ రోల్‌లో నటించనున్నారట. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం.