ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటన  ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నల్లగొండకు బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 12:30 నందికొండకు చేరుకోనున్నారు. అక్కడ్నుంచి 12:40 గంటలకు రోడ్డుమార్గాన నెల్లికల్లుకు వెళ్లనున్నారు. 12:45 గంటలకు నెల్లికల్లులో 13 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒకే చోట శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 12:55 గంటలకు నాగార్జునసాగర్ చేరుకుంటారు. ఒంటిగంటకు హిల్ కాలనీ చేరుకొని.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంట్లో కేసీఆర్ లంచ్ చేయనున్నారు. మధ్యాహ్నం 3:10 గంటలకు హాలియా బహిరంగ సభలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు. సాయంత్రం 4:10 గంటలకు కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు.