ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి ఫుట్‌పాత్‌ ఆక్రమణలను తొలగించాలి : కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ వి.మమత

 


 ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి ఫుట్‌పాత్‌ ఆక్రమణలను తొలగించాలని కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ వి.మమత అధికారులను ఆదేశించారు. పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్వహణ, ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై మూసాపేటలోని జోనల్‌ కార్యాలయంలో మంగళవారం ముఖ్యఅధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. జోన్‌ పరిధిలోని అన్ని సర్కిళ్లలో ఏర్పాటు చేసిన పబ్లిక్‌ టాయిలెట్స్‌ పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గతంలో ఏర్పాటు చేసినవాటి నిర్వహణ, కొత్తగా ఏర్పాటు చేయబోయే టాయిలెట్స్‌ వివరాలు అందించాలన్నారు. అన్నీ ప్రాంతాల్లో మొబైల్‌ టాయిలెట్స్‌ను వాడకంలోకి తీసుకురావాలన్నారు. పాదచారులకు ఇబ్బంది కలిగించే ఆక్రమణలను వెంటనే తొలగించాలని, వీధివ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో అధికారులు శంకర్‌, ప్రదీ్‌పకుమార్‌, రవికుమార్‌, ప్రశాంతి, మంగతాయారు, రవీందర్‌కుమార్‌, యాదయ్య, నాగేందర్‌, కృష్ణచైతన్య, రాజు పాల్గొన్నారు.