టీమిండియా బౌలర్ అశ్విన్ అరుదైన ఘనత

 


టీమిండియా బౌలర్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఓ ఇన్నింగ్సులో తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ తీసిన స్పిన్నర్ గా రికార్డులకు ఎక్కాడు. దీంతో 114 ఏళ్ల తర్వాత ఆ ఫీట్ సాధించిన స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. చిదంబర్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు అశ్విన్. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే అశ్విన్ షాకిచ్చాడు. ఓపెనర్ బర్న్స్‌ను అవుట్ చేశాడు. రహానే చేతికి చిక్కిన బర్న్స్ పెవిలియన్ చేరాడు. దీంతో అరుదైన ఘనతను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుమందు, 114 ఏళ్ల క్రితం.. 1907లో దక్షిణాఫ్రికా బౌలర్ బెర్ట్ వోగ్లర్ ఈ ఘనత సాధించాడు. అంతకు మందు 1888లో ఇంగ్లండ్ స్పిన్నర్ బాబీ పీల్ పేరిట ఈ రికార్డు ఉండేది.