మిస్‌ ఇండియా మానస వారణాసికి ఘనంగా స్వాగతం

 


 మిస్‌ ఇండియా మానస వారణాసికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆ తర్వాత అశోక్‌నగర్‌లోని లెజెండ్‌ అపార్ట్‌మెంట్‌లోని తన నివాసం వద్ద ఆమె తల్లిదండ్రులు రవిశంకర్‌, శైలజతో పాటు అధికారులు, మిత్రు లు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ముంబై నుంచి ఆమె నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ మిస్‌ వరల్డ్‌ సాధించడమే తన లక్ష్యమన్నారు. మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకోవడంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలుపడమే తన జీవితాశయమని ఆమె పేర్కొనారు.