అంగారకుడిపైకి చేరిన పర్సివియరెన్స్‌ రోవర్‌ తీసి న ఫొటోలను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విడుదల

 


అంగారకుడిపైకి చేరిన పర్సివియరెన్స్‌ రోవర్‌ తీసి న ఫొటోలను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విడుదల చేసింది. వీటిల్లో ఒక ఫొటోలో రోవర్‌ను కేబుల్స్‌ సాయంతో మార్స్‌ ఉపరితలంపైకి దించుతున్నట్లు కనిపిస్తోంది. రోవర్‌ను భూమి నుంచి మోసుకెళ్లిన వ్యోమనౌక, మార్స్‌పై దిగుతున్నప్పుడు తీసిన వీడియో నుంచి ఈ ఫొటోను తీసినట్లు నాసా తెలిపింది. ల్యాండింగ్‌ ప్రక్రియ తుదిదశ లో 6 ఇం జన్ల జెట్‌ప్యాక్‌ సాయంతో గంటకు 2.7 కిలోమీటర్ల వేగంతో మార్స్‌ వాతావరణంలోకి ప్రయాణించింది. ట్విట ర్‌ ఖాతా నుంచి నాసా ట్వీట్‌ చేసిన ఈ ఫొటోకు ''అద్భుత విషయాల కోసం ధైర్యం చేయాలి'' వ్యాఖ్యల్ని జత చేసింది.