కామారెడ్డి పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

 


కామారెడ్డి పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టేక్రియాల్ 44వ జాతీయ రహదారిపై మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 13 మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురికి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియల్సి ఉంది.