దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు

 


న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కప్పేసింది. పొగమంచు కారణంగా వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ఆ పొగమంచులో వాహనాలు కూడా సరిగా కనబడటం లేదు. ఐఎస్‌బీటీ, మజ్నూకా తిల్లా ఏరియాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 9.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. చలి కూడా బాగా ఉండటంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు జనాలు జంకుతున్నారు.