సుకుమార్ కూతురి వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు

 


లెక్కల మాస్టర్ సుకుమార్ కూతురి వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. మహేష్ బాబు ఫ్యామిలీ,నాగ చైతన్య ఫ్యామిలీతో పాటు జూనియర్ ఎన్టీఆర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. వీరికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే చైతూ లుక్ అందరిని కట్టిపడేస్తుంది. క్లీన్ షేవ్‌తో కనిపిస్తున్న చైతూ కుర్రాడిలా కనిపిస్తుండడాన్ని చూసి ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.


సుకుమార్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్లాన్ చేస్తున్నారు. మరికొద్ది రోజులలో చిత్ర బృందం కేరళకు వెళ్ళనుంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్‌కు రానుంది.