ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం

 ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. 3,335 పంచాయతీ సర్పంచ్‌ స్థానాలకు, 33,632 వార్డులకు రెండో విడత ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్ల స్వీకరణ మంగళవారం మొదలై.. ఈ నెల 4వ తేదీ వరకు కొనసాగనుంది. ఐదో తేదీ నుంచి పరిశీలన మొదలుకానుంది. 8న మధ్యాహ్నం మూడు గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా.. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేయనున్నారు. 13వ తేదీ పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టి, ఫలితాలు ప్రకటిస్తారు. ఫలితాలు వెలువడ్డాక సాయంత్రం లేదంటే మరుసటి రోజు ఉదయం సర్పంచ్‌, ఉప సర్పంచుల ఎన్నికను నిర్వహించనున్నారు.