పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీగెట్ రెండోవిడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 25 వరకు విద్యార్థులు ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావొచ్చని అధికారులు తెలిపారు. ఈనెల 27 నుంచి మార్చి 1 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించారు. క్యాప్, ఎన్సీసీ, పీహెచ్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను మాన్యువల్‌గా నిర్వహిస్తామని పేర్కొన్నారు. క్యాప్ కోటా వారికి ఈ నెల 27న, పీహెచ్వారికి 27, 28 తేదీల్లో, ఎన్సీసీవారికి మార్చి 1, 2 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని వెల్లడించారు.