మహారాష్ట్రలో కరోనా కలకలం

 


మహారాష్ట్రలో కరోనా కలకలం కొనసాగుతోంది. శనివారం నాడు అక్కడ కొత్తగా 8 వేల పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా జరగడం ఇది వరుసగా నాలుగో సారి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 8,623 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21,46,777కు చేరుకుంది. మరణాల రేటు 2.43 శాతంగా నమోదైంది. కరోనా టెస్టులకు సంబంధించిన పాజిటివిటీ రేటు 13.25 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.3 లక్షల మంది హోం క్వారంటైన్‌లో ఉండగా.. 3084 మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిక క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. మరోవైపు..మొత్తం కరోనా మరణాల సంఖ్య 10302కు చేరుకుంది. కాగా.. కరోనా కట్టడి కోసం అక్కడి ప్రభుత్వం అమరావతిలో లాక్‌డౌన్‌ను మార్చి 8 వరకూ పొడిగించింది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది