షర్మిల పార్టీపై పట్ల రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్....

 


వైఎస్‌ షర్మిల తెలంగాణలో పెట్టబోయే పార్టీపై నేతలు స్పందిస్తున్నారు. తాజాగా, వైఎస్సార్ అభిమానులను ఏకం చేయాలని షర్మిల ప్రయత్నిస్తుండడం పట్ల రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. మతం ప్రాతిపదికన కొత్త పార్టీలు వస్తున్నాయని, కానీ ఇక్కడ మనిషి గురించి ఆలోచించేవాళ్లకే ప్రజల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మతం పేరుతో వచ్చే ఇతర రాష్ట్రాల వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈటల పేర్కొన్నారు. సెంటిమెంట్లు ఎక్కువకాలం పనిచేయవని అభిప్రాయపడ్డారు. అయినా కొత్తగా వచ్చేవాళ్లకు ఈ ప్రాంతంలో ఏం పని..? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కాగా, షర్మిల పార్టీని టీఆర్ఎస్ నేతలు ఎవరూ స్వాగతించడంలేదు. ఎవరికీ వారే ఘాటుగానే స్పందిస్తున్నారు.