గ్రేటర్లో కొత్తగా నోటిఫై అయిన బార్లకు సంబంధించి నేడు (శుక్రవారం) లక్కీ డ్రాను తీయనున్నారు. లాటరీ పద్ధతిన డ్రా తీసి బార్లను కేటాయించనున్నట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో 55 బార్ అండ్ రెస్టారెంట్లకు నోటిఫికేషన్ ఇవ్వ గా, మొత్తం 1378 దరఖాస్తులు అం దాయి. 55 బార్లకు సంబంధించి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినందున లాటరీ ద్వారా దరఖాస్తులను ల క్కీ డ్రా తీసి బార్లను కేటాయించనున్న ట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేర కు నాగోల్‌లోని అనంతుల రామిరెడ్డి ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్, ఆబ్కారీ ఉన్నతాధికారుల సమక్షంలో లాటరీ పద్ధతిన బార్ల లక్కీడ్రా తీయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఎనిమిది బార్లకు సంబంధించి 347 దరఖాస్తులు వచ్చినట్లు మల్కాజిగిరి ఈఎస్ కె.ప్రదీప్‌రావు తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ సమక్షంలో బార్ల కేటాయింపును లాటరీ పద్ధతిన ప్రశాంతంగా నిర్వహించారు.
'మేడ్చల్'కు ఎనిమిది బార్లు..
మేడ్చల్ కలెక్టరేట్: జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎనిమిదింటికి గాను 347 దరఖాస్తులు రాగా, కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో అదనపు కలెక్టర్ శ్యాంసన్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో గురువారం కేటాయింపులు జరిపారు.
రంగారెడ్డి బార్లకు కలెక్టర్ డ్రా..
బడంగ్‌పేట: బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్-సామల పాపిరెడ్డి గార్డెన్స్ లో బార్ల డ్రాను నిర్వహించారు. కార్య క్రమానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమో య్ కుమార్ హాజరై డ్రా తీశారు. ఆరు చోట్ల ఉన్న బార్లకు డ్రా తీయాల్సి ఉండ గా, జెల్పల్లి బార్ డ్రా వాయిదా పడిన ట్లు పేర్కొన్నారు. తుక్కుగూడలో ఒక్క బారుకు 124 దరఖాస్తులు, అదిబట్ల బార్‌కు 110 , అమనగల్ బార్‌కు 88, బండ్లగూడ జైయిర్ రెండు బార్లకు గాను 105, శంకర్పల్లి బార్‌కు 123 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు.