పైడిపాలెం గ్రామ పంచాయతీలో అధికార వైసీపీ దాడులపై ఎస్‌ఈసీకి...

 
కడప జిల్లా సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం గ్రామ పంచాయతీలో అధికార వైసీపీ దాడులపై ఎస్‌ఈసీకి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వైఎస్సార్పీపీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులపై దాడికి తెగబడుతున్నారని మండిపడ్డారు. మౌఖికంగాను, భౌతికంగాను బెదిరింపులకు, దాడులకు దిగడం ద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రజాస్వామ్య ప్రక్రియ నాశనం చేస్తున్నారన్నారు. ఇలాంటి సంఘటన 2021 ఫిబ్రవరి 15న కడప జిల్లా సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం గ్రామ పంచాయతీలో జరిగిందని తెలిపారు. పైడిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు వైసీపీయేతర అభ్యర్థి శివ అంజనమ్మ నామినేషన్ దాఖలు చేశారని...అయితే అంజనమ్మను వైసీపీ నాయకులు బెదిరించారని లేఖలో తెలిపారు. నామినేషన్ ఉపసంహరించుకోపోతే భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారని చెప్పారు. ఆమె వ్యవసాయ క్షేత్రం ఫెన్సింగ్‌ను పూర్తిగా నాశనం చేయడమే కాక పాక్షికంగా చిని పంటను నాశనం చేశారన్నారు. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే ఆమె చిని పంటను పూర్తిగా నాశనం చేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు.


పైడిపాలెం గ్రామంలో వైసీపీయేతర మరొక అభ్యర్థి కటికా ఓబులమ్మను సర్పంచ్ నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరించారని, ఓబులమ్మ గ్రామంలో ఒక చిన్న దుకాణం నడుపుకుంటూ దాని ద్వారా తన జీవనం సాగిస్తుందని ఆయన చెప్పారు. ఆమె నామినేషన్లను ఉపసంహరించుకోకపోతే వైసీపీ నాయకులు ఆమె దుకాణంను కూల్చేస్తామని బెదిరించారన్నారు. ఈ బెదిరింపులన్నీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సోదరుడు రాచమల్లు కిరణ్ రెడ్డి చేయిస్తున్నారని ఆరోపించారు. అంజనమ్మ, కటికా ఓబులమ్మలకు సరైన భద్రత కల్పించాలని కోరారు. భయం, పక్షపాతం లేకుండా ఎన్నికలలో స్వేచ్ఛగా పోటీ చేయడానికి వారికి భద్రత కల్పించాన్నారు. అదే సమయంలో బెదిరింపులపై దర్యాప్తు చేసి దోషులను శిక్షించడం చాలా అవసరమని తెలిపారు.ఎన్నికల సంఘం వేగవంతంగా సంప్రదించ