కడపలో రేషన్ సరుకుల పంపిణీకి చుక్కెదురు  సీఎం జగన్ సొంత ఇలాకాలో ఇంటి ఇంటికీ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి చుక్కెదురైంది. కడప నగరంలో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. వాహన డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దాదాపు 40 వాహనాలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. డ్రైవర్ పని కాకుండా అన్ని పనులు తమతోనే చేయిస్తున్నారని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. అయితే వాహనాలు నడపకపోతే కేసులు పెడతామని అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీఆర్వోల ద్వారా తమపై ఒత్తిడి తెస్తున్నట్లు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.