హైదరాబాద్ : కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణం చేశాకే మేయర్, డిప్యూటీ మేయర్లుగా పోటీ చేయడానికి కానీ, వారిని ఎన్నుకునేందుకు ఓటు వేసేందుకు కానీ అవకాశం ఉంటుంది. ఈ నెల 11వ తేదీన ఒంటిగంట కల్లా అందరూ జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయ్యాక, ఎన్నిక కార్యక్రమం ప్రారంభమయ్యాక ప్రమాణ స్వీకారానికి అవకాశం ఉండదు.