ఉపరితల ద్రోణి బలహీన పడింది. దీని ప్రభావంతోపాటు రాష్ర్టంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత కొనసాగుతున్నది. అక్కడక్కడ తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు)లో అత్యల్పంగా 12.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని బీహెచ్ఈఎల్లో 16.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ర్ట సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12.9 నుంచి 18.9 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని టీఎస్‌డీపీఎస్ తెలిపింది. రాష్ర్టంలో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌లో 35.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు చెప్పింది. కాగా, గడిచిన 24 గంటల్లో వనపర్తిలో చిరుజల్లులు కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు, హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి.