ఆంధ్రప్రదేశ్‌లో మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

 


ఆంధ్రప్రదేశ్‌లో మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. 2,639 సర్పంచి, 19,553 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్‌ మొదలయింది. మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల దాకా, మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 దాకా పోలింగ్‌ కొనసాగనుంది. 13 జిల్లాల్లోని 160 మండలాల్లో 26,851 పోలింగ్‌ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. సుమారు 55,75,004 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడో దశలో 3,221 గ్రామ పంచాయతీల్లో 579 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. విశాఖపట్నం, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లోని మూడు పంచాయతీల్లో సర్పంచి, వార్డుసభ్యుల స్థానాలకు ఎవరూ నామినేషన్‌ వేయలేదు.