రాములో రాములా లిరికల్ సాంగ్ సరికొత్త రికార్డ్స్

 


అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులోని పాటలకు సంగీత ప్రియులు ఎంతగా ముగ్ధులయ్యారో తెలిసిందే. ప్రతి పాట శ్రోతలని రంజింపజేసింది. అంతేకాదు పలు రికార్డ్స్ కూడా సృష్టించాయి. సినిమా రిలీజ్‌కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన లిరికల్ సాంగ్స్ రాములో రాములా ఒకటి. ఈ లిరికల్ సాంగ్ మన దక్షిణాదిలోనే ఫస్ట్ ఎవర్ సెన్సేషనల్ రికార్డును అందుకుంది.


ఇప్పటికే రాములో రాములా లిరికల్ సాంగ్ సరికొత్త రికార్డ్స్ సృష్టించగా, ఇప్పుడు ఫుల్‌ వీడియో సాంగ్‌ 300 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతూ యూట్యూబ్‌ సెన్సేషనల్‌ అయ్యింది. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫి అందించిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణీ, మంగ్లీలు ఆలపించారు. బన్నీ సినిమా సాంగ్స్ రికార్డ్ లు నమోదు చేస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.