జీహెచ్‌ఎంసీ నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత నేడు పదవీ బాధ్యతలు

 


జీహెచ్‌ఎంసీ నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9:30 గంటలకు తమ కార్యాలయాల్లో పూజల అనంతరం బాధ్యతలు స్వీకరిస్తారు. నగర మేయర్‌గా గద్వాల్‌ విజయలక్ష్మి నేడు బాధ్యతలు స్వీకరించునున్న నేపథ్యంలో అదివారం తన తండ్రి కేశవరావుతో కలిసి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుమందు మేయర్‌ చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.