లాకర్‌ హోల్డర్లకు లిఖితపూర్వక నోటసు లేకుండా బ్యాంకులు లాకర్లను విచ్ఛిన్నం చేయ లేవని సుప్రీంకోర్టు స్పష్టం

 


లాకర్‌ హోల్డర్లకు లిఖితపూర్వక నోటసు లేకుండా బ్యాంకులు లాకర్లను విచ్ఛిన్నం చేయ లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లాకర్‌ సదుపాయానికి సంబంధించి ఆరు నెలల్లోగా నిబంధనలు రూపొందించాలని జస్టిస్‌ ఎం శాంతనగౌడర్‌, జస్టిస్‌ వినీత్‌ సరన్‌లతో కూడిన ధర్మాసనం ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేసింది. లాకర్‌ సౌకర్యం, సురక్షిత డిపాజిట్‌ సదుపాయాల నిర్వహణకు సంబంధించి బ్యాంకులు తీసుకోవలసిన చర్యలను తప్పనిసరి చేస్తూ ఆర్బీఐ సమగ్ర సూచనలు చేయాలని తెలిపింది. వినియోగదారులపై ఏకపక్ష, అన్యాయమైన నిబంధనలను విధించే స్వేచ్ఛ బ్యాంకులకు ఉండకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.