రెండురోజుల విరామం తరువాత సోమవారం నుంచి కరోనా సెకండ్ డోస్ పునఃప్రారంభం కానున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పరిధిలోని హెల్త్‌కేర్ వర్కర్లకు సంబంధించి రెండవ దశ టీకా ప్రక్రియ దాదాపు చివరిదశకు వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తల తరువాత ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న హెల్త్‌కేర్ వర్కర్లకు సెకండ్ డోస్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.