ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ సియట్ తమ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ సినీ హీరో దగ్గుబాటి రానాను నియమించుకుంది. ఈ మేరకు ఆయనతో డీల్ కుదుర్చుకున్నట్టు సియట్ పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో రానాకు ఎంతో మంది అభిమానులు ఉన్నారని, ఈ బైక్ టైర్ల మార్కెటింగ్ కోసం సరికొత్త క్యాంపెయిన్ ను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో టీవీ, డిజిటల్ వాణిజ్య ప్రకటనలో రానా కనిపించనున్నారు. ఇందులో రానా బాబా అవతారంలో బైక్ నడుపుతూ కనిపించారు.
ప్రస్తుతం రానా నటించిన 'అరణ్య', 'విరాటపర్వం' సినిమాలు ఈ వేసవిలో థియేటర్లోకి రానున్నాయి. ఇక పవన్ తోను మలయాళంలో సూపర్ హిట్ అయినా 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ లో రానా నటిస్తున్నాడు.