బాలాకోట్‌ ఆపరేషన్‌కు రెండేళ్లు

 ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత సైన్యం నిర్వహించిన బాలాకోట్‌ ఆపరేషన్‌కు రెండేళ్లు పూర్తయ్యాయి. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌) చెందిన ఫైటర్‌ జెట్లు నియంత్రణ రేఖను(ఎల్‌ఓసీ) దాటి, పాకిస్తాన్‌ భూభాగంలోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో ఉగ్రవాదులకు భారీగా నష్టం వాటిల్లింది.