ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తరలింపు నిర్ణయం ప్రస్తుతం ఏపీ హైకోర్టు పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం
 ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తరలింపు నిర్ణయం ప్రస్తుతం ఏపీ హైకోర్టు (సబ్‌ జ్యూడీస్‌)పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతి నుంచి ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారా? అని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టు తరలింపునకు ఏపీ సీఎం జగన్‌ ప్రతిపాదనలు పంపారని తెలిపారు. ఉన్నత న్యాయస్థానం తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయమని పేర్కొన్నారు. హైకోర్టు నిర్వహణ ఖర్చు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.