నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత సోమవారం పదవీ బాధ్యత లు

 


నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత సోమవారం పదవీ బాధ్యత లు స్వీకరించనున్నారు. ఈనెల 11న జరిగిన మేయర్‌, ఉప మేయర్‌ ఎన్నికల్లో గెలుపొందిన వారిద్దరు 22న ఉదయం 9:30 గంటలకు తమ కార్యాలయాల్లో పూజల అనంతరం బాధ్యతలు స్వీకరిస్తారు.  మేయర్‌కు మంత్రి అభినందనలు  జీహెచ్‌ఎంసీ కొత్త మేయర్‌ గద్వాల విజయలక్ష్మి శనివారం మంత్రి హరీశ్‌రావుతో పాటు మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ను శనివారం వారి నివాసా ల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మేయర్‌ను అభినందించారు.